Monday, July 8, 2024

Amberpet : ఎదురుతిరిగిన పార్థీ గ్యాంగ్.. పోలీసుల కాల్పులు

హైదరాబాద్ శివారు పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఇటీవల వరుస చోరీలకు పాల్పడుతున్న పార్థీ గ్యాంగ్ ను పట్టుకునేందుకు నల్గొండ సీసీఎస్ పోలీసులు వెంబడించారు. పెద్ద అంబర్పేట్ ఔటర్ వద్ద వారిని అడ్డగించి పట్టుకునే ప్రయత్నం చేశారు.

అయితే వారు ఎదురుతిరగడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం నలుగురిని నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోయారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement