Saturday, November 23, 2024

Review – హైద‌రాబాద్ సిటీ తాగునీటికి 20 టీఎంసీల గోదావ‌రి జ‌లాలు – రేవంత్ రెడ్డి

జ‌ల‌మండ‌లి, ఇరిగేష‌న్ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రానికి 20 టీఎంసీల గోదావ‌రి జ‌లాలు అవ‌స‌రమ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించి స‌మ‌గ్ర నివేదిక త‌యారు చేయాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. శ‌నివారం జూబ్లీహిల్స్ నివాసంలో జ‌ల‌మండ‌లి, ఇరిగేష‌న్ ఉన్న‌తాధికారుల‌తో ఆయ‌న స‌మీక్ష స‌మావేశం ఏర్పాటు చేశారు. సమీక్షలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ప్రశాంత్ జె. పాటిల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

వ‌చ్చే నెల ఒక‌టో లోగా టెండ‌ర్లు
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొండపోచమ్మ , మల్లన్న సాగర్ ప్రాజెక్టు ల నుంచి నీటి తరలింపు పైన సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపునకు ఎంత వ్యయం అవుతుంది, నీటి లభ్యత పైన పూర్తి అధ్యయనం చేయాలని సూచించారు. వచ్చే నెల ఒక‌టో తేదీ వరకు టెండర్లకు వెళ్లేలా కార్యాచ‌ర‌ణ‌ రూపొందించాలన్నారు. మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement