హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి లలోని 12అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు, కలెక్టర్ లు ఎస్పీలు, అధికారులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… 12 నియోజకవర్గాల్లో పెండింగ్ లో సమస్యల పరిష్కారం కోసం జరగబోయే బడ్జెట్ లో కేటాయింపుల విషయంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ… ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల కృషి కోసం జరగబోయే బడ్జెట్ లో కావలసిన అంశాలపై ఈ కార్యక్రమం ద్వారా ఒక అవగాహన లభిస్తుందన్నారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో సమస్యల పరిష్కారం, నిధుల కేటాయింపునకు ఈ సమావేశం ఉపయోగ పడుతుందన్నారు. నియోజక వర్గాల్లో ఎలాంటి సమస్యలున్నా జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగులేటి కి, జిల్లా మంత్రుల దృష్టికి తీసుకురావాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటగా ములుగు నియోజకవర్గం నుండి ఇరిగేషన్ శాఖ పై సమావేశం ప్రారంభమైంది.