Tuesday, November 26, 2024

Review Meeting – విద్యుత్ అప్పులు.. బకాయిలు లెక్కలు తేల్చండి… ట్రాన్స్ కో, జెన్ కో లకు సిఎం ఆదేశం …

హైదరాబాద్ …2014 జూన్ 2 ముందు ఉన్న పరిస్థితి.., ప్రస్తుత ఉన్న పరిస్థితి పూర్తి నివేదక ఇవ్వాల‌ని ట్రాన్స్ కో, జెన్ కో అధికారుల‌ను సిఎం రేవంత్ ఆదేశించారు..నేడు సెక్రటేరియట్ లో సీఎం రే విద్యుత్ పై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖ సమీక్షలో విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, సింగరేణి సిఎండి శ్రీధర్, విద్యుత్ శాఖ జేఎండి శ్రీనివాసరావు, ఎస్పీడిసియేఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఎన్పిడీసీఎల్ సిఎండి గోపాల్ రావు, జెన్ కో, ట్రాన్స్ కో విద్యుత్ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉన్నతాధికారులు ఇచ్చారు. 85 వేల కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. ప్ర‌భుత్వ నుంచి రావల‌సిన బ‌కాయిలు రాక‌పోవ‌డం, ప్ర‌భుత్వ కార్యాల‌యాల విద్యుత్ బిల్లులు చెల్లింపులు జ‌ర‌గ‌క‌పోవ‌డం, రైతుల ఉచిత విద్యుత్ వాడ‌కం వాటాను ప్ర‌భుత్వం చెల్లించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ నష్టాల‌కు కార‌ణ‌మ‌ని వివ‌రించారు..

అధికారులు చెప్పిన విష‌యాలు విన్న రేవంత్ . 2014 జూన్ 2 కంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు స్పష్టంగా ఇవ్వాలని తెలిపారు. మరోవైపు సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు .దీంతో సీఎం ఈరోజు సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో తెలుపాలని అన్నారు. కాగా, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఇటీవల రాజీనామా చేశారని తెలిపారు. అయితే దీంతో సీఎం రేవంత్ రెడ్డి సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదం తెలపవద్దని సమీక్షకు ఆయన్ను కూడా పిలవాలని ఆదేశాలు జారీ చేశారు.

సెక్రటేరియట్‌లో జరిగిన విద్యుత్ శాఖపై రివ్యూకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి పిలిస్తే వెళ్లకుండా ఎందుకు ఉంటానని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ శాఖ నుంచి కానీ, సీఎంవో నుంచి కానీ తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు. తనకి ఆహ్వానం అంది ఉంటే కచ్చితంగా సమావేశానికి హాజరయ్యే వాడినని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement