Monday, November 18, 2024

Review Meeting – పౌర సరఫరాల శాఖను బి అర్ ఎస్ ప్రభుత్వం అప్పుల పాలుచేసింది – ఉప ముఖ్యమంత్రి భట్టి

హైదరాబాద్ – పదేళ్ల బి అర్ ఎస్ పాలనలో పౌర సరఫరాల శాఖను నిర్వీర్యం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. అప్పులు, వడ్డీలతో ప్రజలపై భారం మోపారని ఆక్షేపించారు.వార్షిక బడ్జెట్‌ కసరత్తులో భాగంగా పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనేలా పౌరసరఫరాల శాఖకు నిధులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజాభిప్రాయాలకు అణుగుణంగానే అభివృద్ధి సాగుతుందని స్పష్టం చేశారు.

” బీఆర్ఎస్ సర్కార్ తప్పుడు ఆలోచనల వల్ల పౌరసరఫరాల శాఖపై భారం పడింది.అధికారులు పొంతన లేని లెక్కలు ఇస్తున్నారు. సమయానికి చెల్లింపులు చేయకపోవడంతో రూ.58 వేల కోట్లకుపైగా భారం పడింది. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి బీఆర్ఎస్ అప్పులు చేసింది.ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే తప్పా ధాన్యం కొనలేని పరిస్థితి ఏర్పడింది. పౌర సరఫరాల శాఖను అప్పులపాలు చేసినా.. రేషన్ బియ్యం, విద్యార్థులకు సన్నబియ్యం, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ఆలస్యం కాకుండా చూశాం” అని భట్టి వివరించారు..

కేఆర్‌ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించం – ఉత్తమ్

కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించాలన్న ప్రతిపాదనలేవీ తాము చేయలేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్‌తో అంటకాగి, కృష్ణా జలాల్లో వాటాను వదులుకున్న చరిత్ర కేసీఆర్‌దేనని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ఖజానాను భారాస లూటీ చేసిందని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని భారాస చేతిలో పెడితే అప్పులపాలు చేశారని, అందుకే ప్రజలు ఆ పార్టీకి వీఆర్‌ఎస్‌ ఇచ్చారన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు. గతంలో ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌, జగన్‌ మాట్లాడుకున్న విషయాలు ప్రజలకు ఎందుకు చెప్పలేదని ఉత్తమ్‌ ప్రశ్నించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement