Wednesday, January 22, 2025

TG | రేవంత్ మాట‌లు నీటి మూట‌లే.. హరీశ్ రావు

సిద్దిపేట : అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అదే పరంపర కొనసాగిస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేట పట్టణంలోని 15 వార్డ్ గాడి చెర్లపల్లిలో ఇవాళ‌ నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ… దరఖాస్తుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. ఏడాది కిందట దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ దిక్కులేద‌ని, మళ్లీ ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలని మండిపడ్డారు. అప్పుడు అందరికి పరమాన్నం పెడుతామని ఇప్పుడు అందరికి పంగనామాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఇప్పుడు మిత్తీ కట్టించుకుని పాక్షిక రుణమాఫీ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఎంతోమంది రైతులు ఆగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు, రుణమాఫీ సగం కూడా చేయలేదన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి గ్రామసభలకు రావాల‌ని, తాను కూడా వస్తాన‌ని అంటూ నిజం ఏమిటో నిగ్గుతేలుద్దామ‌న్నారు హారీశ్ రావు.

చంద్ర‌బాబు, హేమంత్ సోరెన్ లు భేష్…
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేరుస్తుర‌ని, అలాగే ఆంధ్రాలో గెల్వగానే పెంచుతా అన్న పెన్షన్‌ను చంద్రబాబు పెంచి ఇచ్చార‌ని వెల్ల‌డించారు.. కానీ ఇక్క‌డ రేవంత్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు కూల్చడం తప్పా ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. వ్యవసాయ కూలీల అందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలన్నారు. గ్రామ సభల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement