కవి, గాయకుడు, సామాజిక ఉద్యమకారుడు, ప్రజా యుద్ధనౌక స్వర్గీయ గద్దర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళులర్పించారు. ఈ మేరకు అమెరికా నుంచి సీఎం రేవంత్ ఒక ప్రకటన విడుదల చేశారు.
‘రాజరికం కత్తి మీద నెత్తురుల గాయమా.. దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా..’ అంటూ పాటలతోనే పోరు బాటలు వేసిన నిఖార్సైన తెలంగాణ వాది, పొడుస్తున్న పొద్దులో వినిపించే ప్రజా విముక్తి గీతం గద్దరన్న అని ఒక సందేశంలో ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గద్దర్ పేరిట సాంస్కృతిక-సినీ అవార్డులను నెలకొల్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
- Advertisement -