Wednesday, November 20, 2024

Revanth’s Success Tour – ఫుల్‌ హ్యాపీ! పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు

నేటితో ముగియ‌నున్న సీఎం విదేశీ టూర్‌
ప్ర‌స్తుతం ద‌క్షిణ కొరియాలో ఉన్న రేవంత్ బృందం
రాత్రికి అక్క‌డ నుంచి బ‌య‌లుదేర‌నున్న సీఎం
కొరియాలోని ప‌లు కంపెనీల ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు
తెలంగాణ‌కు రావాల్సిందిగా ప‌లు సంస్థ‌ల‌కు ఆహ్వానాలు
స్టేట్ పారిశ్రామిక పాల‌సీపై ప‌వ‌ర్‌ పాయింట్ ప్ర‌జెంటేష‌న్
అమెరికా, కొరియా ప‌ర్య‌ట‌నల విజ‌య‌వంతంపై సంతోషం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, హైద‌రాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన మంగ‌ళ‌వారంతో ముగియనుంది. ప్ర‌స్తుతం ద‌క్షిణ కొరియాలో ఉన్న ఆయ‌న ఇవ్వాళ రాత్రికి అక్క‌డ నుంచి బ‌య‌లు దేరి రేపు హైదరాబాద్ రానున్నారు. కాగా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా నుంచి పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలను ఆకర్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతమైంది. మూడు రోజుల క్రితం అమెరికా పర్యటన ముగించుకుని కొరియా చేరుకున్న సీఎం రేవంత్ బృందం అక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంది.

- Advertisement -

ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేస‌న్‌
తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఈ సంద‌ర్భంగా సీఎం వివరించారు. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డీసీసీ చీఫ్ రోహిణ్ రెడ్డి ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఇక‌.. వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులు రాబట్టుకున్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు.

ప‌లు కంపెనీల‌తో చ‌ర్చ‌లు..

ఇక.. మంగ‌ళ‌వారం కూడా కొరియాలోని వివిధ కంపెనీలు , వివిధ వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో సీఎం బృందం చర్చలు జ‌రిపింది. కొరియా టెక్స్‌టైల్ ఫెడరేషన్ చైర్మన్ క్యాక్ సంగ్, వైస్ చైర్మన్ సోయోంగ్ జూతో సహా 25 అగ్రశ్రేణి టెక్స్‌టైల్ కంపెనీల అధినేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీ హ్యుందాయ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మెగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. భారత్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (హెచ్‌ఎంఐఈ) ద్వారా మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డి బృందానికి తెలిపారు. కాగా నేటి ఉద‌యం రేవంత్ టీమ్ ఫ్యూచర్ హ్యాంగంగ్ ప్రాజెక్ట్ హెడ్ క్వార్టర్స్ వెళ్లింది.. అక్క‌డ వారికి తెలంగాణ‌లో పెట్టుబ‌డుల అవ‌కాశాల గురించి వివ‌రించింది.. వారి నుంచి సానుకూల స్పంద‌న వ‌చ్చన‌ట్లు రేవంత్ టీమ్ ప్ర‌క‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement