Friday, November 22, 2024

Revanth’s ప్ర‌జా ద‌ర్బార్ లో వెల్లువెత్తిన విన‌తులు…ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను సానుకూలంగా విన్న‌ సిఎం

హైద‌రాబాద్ – నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో నేడు నిర్వ‌హించారు.. ప్రభుత్వానికి తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వారి నుంచి ముఖ్యమంత్రి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకుని, క్యూలైన్లలో లోపలకు పంపారు..


ఈ ప్ర‌జా ద‌ర్భార్ లో సీఎం రేవంత్‌ను కొండపోచమ్మ ముంపు బాధితులు క‌లిశారు. ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని సీఎంకు వివరించారు బాధితులు. దీనిపై స్పందించిన రేవంత్ వారికి న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అలాగే వివిద స‌మ‌స్య‌ల‌పై ప‌లువురు ముఖ్య‌మంత్రికి విన‌తి ప‌త్రాలు అంద‌జేశారు.

ఇది ఇలా ఉంటే ప్రజా దర్బార్‌కు ప్రత్యేక యంత్రాగం. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించేందుకు 20 మంది సిబ్బందిని నియ‌మించారు.. వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖ అధికారులకు సిఫార్స్ చేశారు సీఎం . ప్రతీ నెల వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై తిరిగి స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

‘తెలంగాణ అసలు దొంగలు’ పేరుతో ఫ్లెక్సీ …

జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో ఓ ఫ్లెక్సీ హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ అసలు దొంగలు.. బేకార్ బీహార్ బ్యాచ్ అంటూ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ ఒకరు ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఈ ఫ్లెక్సీలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, రిటైర్డ్ ఐఏఎస్‌లు రాజీవ్ శర్మ, సోమేష్ కుమార్, నర్సింగ్ రావు, రజత్ కుమార్ ఫోటోలను ప్రదర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement