హైదరాబాద్, ఆంధ్రప్రభ: భారాస కార్య నిర్వా హక అధ్యక్షుడు మంత్రి కేటీ- రామారావుకు తెలంగాణ ఉద్యమానికి ఎటు-వంటి సంబంధం లేదని, కేటీఆర్ పేరే అరువు తెచ్చుకున్నారని పీసీసీ చీఫ్, లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణతో కేటీఆర్‌కి పేరు బంధమే తప్ప.. పేగు బంధం లేదని, కేసీఆర్ కుమారుడు అనేదే అర్హత అని అన్నారు. ఇంది రా గాంధీ కుటు-ంబం వారసురాలు.. వాళ్ల కాళ్ళు మొ క్కితే చేసిన తప్పులలో కొంతైన పాపం తగ్గుతుందని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ఆయన కుటు-ంబాన్ని హతమారుస్తానని భాజపా నేత మణికంఠ నరేంద్ర రాథోడ్‌పై చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియా ప్రతిని ధులతో మాట్లాడారు. అభివృద్ధి నమూనా అంటే మూ డు వేల మద్యం దుకాణాలు ఆరు వేల బార్లు కాదని చెప్పారు. టెన్త్ ప్రశ్నపత్రాల లీకులు ఆదర్శంగా తీసుకో వాలా..? టీ-ఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకులు అధ్యయనం చేయాలా..? తెలంగాణలో ఏం స్టడీ చేయాలి.. పరాయి రాష్ట్రం నుండి కిరాయి మనుషులను తెచ్చుకుని, సిగ్గులేని మాటలు మానేసి, మర్యాద పూర్వకంగా వచ్చి ప్రియాంక గాంధీకి పాదపూజ చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసినం అని క్షమాపణ చెప్పు అంటూ మంత్రి కేటీ-ఆర్‌కు రేవంత్ రెడ్డి బదులిచ్చారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఆయన కుటు-ంబం హైదరాబాద్ నాంపల్లిలోని దర్గా దగ్గర అడుక్కు తినేవాళ్ళని పేర్కొన్నారు. త్యా గాల కుటు-ంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఆయన కుటుంబాన్ని తరి మి కొడతారని హెచ్చరించారు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి కేసీఆర్ కుటు-ంబం తప్పుకుంటే కనీ సం మానవులుగానైనా తెలంగాణ సమాజం వారిని గుర్తిస్తుందని చెప్పారు.
ఖర్గే హత్యకు కుట్రపై ఫిర్యాదు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు- చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఖర్గే చేసిన అభివృద్ధే ఇప్పటికీ కనిపిస్తోందని, ఆయన హయా ంలో కర్ణాటక అన్ని రంగాల్లో ముందుకు వెళ్లిందని చెప్పారు. ఓటమి ఎరుగని ఖర్గే లోక్‌సభలో ప్రధాని మోడీ అవినీతిని ఎండగట్టి గడగడ లాడించారని చెప్పారు. అందుకే ఆయనపై కక్షగట్టి 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఓడించిందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన తనయుడు ప్రియాంక్ ఖర్గేను కూడా ఓడించేందుకు భాజపా నానా తంటాలు పడుతోందని చెప్పారు. ఖర్గే నాయకత్వాన్ని ఎదుర్కోలేకే భాజపా ఆయన కుటు-ంబాన్ని హతమార్చే కుట్రకు దిగిందని ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటు-ంబ సభ్యులను హత్య చేస్తామని బెదిరించారని రేవంత్ ఆరోపించారు. కర్ణాటకలోని చిత్తాపూర్ నియో జకవర్గం నుండి ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీ- చేస్తున్నారని, ఖర్గే కుమారునిపై మణికంఠ రాథోడ్ తడి పార్‌ని బీజేపీ బరిలోకి దింపిందని చెప్పారు. అయితే.. ఖర్గేని రౌడీ షీటర్, బీజేపీ అవతార్ మణికంఠ రాథోడ్ బెదిరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఖర్గే కుటుం బాన్ని చంపేస్తానంటన్న ఆడియోలు కూడా బయటకు వచ్చాయని చెప్పారు. ఈ మేరకు పోలీసు లకు ఫిర్యాదు చేశామని వివరించారు. ఖర్గేని చంప డానికి రాథోడ్ చేసిన కుట్రపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.