మాచారెడ్డి, అక్టోబర్ 31 (ప్రభ న్యూస్) : కొడంగల్‌లో నరేందర్‌రెడ్డిపై ఓడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై గెలుస్తారా అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మాచారెడ్డి, రామారెడ్డి మండలాల బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఎన్నికల ప్రచారంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానంటున్న రేవంత్ డిపాజిట్‌ను కామారెడ్డి ప్రజలు గల్లంతు చేస్తారని చెప్పారు.
ప్రతి ఒక కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి సీఎం కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. అదే విధంగా గ్రామాల్లో అభివృద్ధి సాధించింది సీఎం కేసీఆర్ వళ్లనే మరి ఈరోజు కామారెడ్డిలో పోటీ చేస్తున్నటువంటి కేసీఆర్ గెలిస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు దొందు దొందే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసిందని ఓట్లు అడుగుతున్నారని జనాల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి గ్రామంలో జనాలకు కేసీఆర్ చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి పనిని తీసుకు వెళ్లాలని సభలో ఆయన తెలిపారు.