Friday, November 22, 2024

Revanth vs KCR – ఇచ్చుడో.. స‌చ్చుడో తేల్చుకుందాం… వచ్చేయండి

కేసిఆర్ తో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద దీక్ష‌
తెలంగాణ‌కు బ‌డ్జెట్ లో అన్యాయంపై పోరాటం
బిఆర్ఎస్ అధినేత రావాలంటూ రేవంత్ ఆహ్వానం
రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాలు ముఖ్య‌మైతే క‌లసి
రావాల‌ని గులాబీ బాస్ కు ముఖ్య‌మంత్రి పిలుపు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – సొల్లు క‌బుర్లు వ‌ద్దు… తెలంగాణ అభివృద్ధికి కేంద్రంపై క‌లసి క‌ట్టుగా పొరాడ‌దాం.. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద దీక్ష‌లో కూర్చుని ఇచ్చుడో… స‌చ్చుడో తేల్చేసుకుందాం అంటూ గులాబీ ద‌ళ‌ప‌తి కెసిఆర్ కు స‌వాలు విసిరారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి .. అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులపై జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ,
తొలుత రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీలో పోరాడదామని పిలుపునిచ్చారు. అందరం వెళ్లి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేద్దామన్నారు. ఏకతాటిపైకి వచ్చి పోరాడదామని అన్నారు. కేంద్ర మంత్రులు నిధులు తెస్తారో.. రాజీనామా చేస్తారో తేల్చుకోవాలని తెలిపారు.

- Advertisement -

ఈ మాటలకు సీఎం రేవంత్ రెడ్డి బదులిస్తూ, మెమెప్పుడూ చావు నోట్లో తల పెట్టామని పదే పదే చెప్పలేద‌న్నారు.. మేం అగ్గిపెట్టే మర్చిపోయి అమాయక విద్యార్థులను బలిగొనలేదంటూ బిఆర్ ఎస్ నేత‌ల‌పై చ‌లోక్తులు విసిరారు. ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ ను రమ్మనండి ముఖ్యమంత్రిగా నేనూ వస్తా.. ఇద్దరం జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్షకు కూర్చుందాం.. తెలంగాణకు నిధులు తెచ్చుడో.. సచ్చుడో తేల్చుకుందాం.. మీరు తారీఖు డిసైడ్ చేయండి జంతర్ మంతర్ లో దీక్షకు మేం సిద్దం అంటూ తేల్చి చెప్పారు . రాష్ట్రానికి నిధులు కోసమైనా కేసీఆర్ దీక్షకు ముందుకు రావాలని సీఎం రేవంత్ కోరారు. పాలక పక్ష నేతగా తాను వస్తా అని.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రావాలని రేవంత్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా తాను సిద్ధమన్నారు. సచ్చుడో.. తెలంగాణకు నిధులు తెచ్చుకునుడో జరగాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement