జనరల్ ఎలక్షన్స్ వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఒక పార్టీపై మరో పార్టీ లీడర్లు విమర్శలతో దాడి చేస్తున్నారు. అవినీతి, అక్రమాలు చేశారంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే.. గతం కంటే భిన్నంగా పీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి దూకుడు పెంచారు. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను దూషిస్తూనే.. ఇటు బీజేపీ నేతలను మాటలతో చెడుగుడు ఆడేస్తున్నారు. ఇక.. నామినేషన్ల పర్వం ముగిసి పోటీలో ఉండే అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత తెలంగాణలో ప్రచారానికి ప్రధాని మోదీ వచ్చారు. దీంతో ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ చీఫ్ రేవంత్ వారికి దీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా, మోదీ రాకతో రేవంత్ కాస్త కొత్త ఒరవడితో విమర్శల దాడికి దిగారు. ఇన్నాళ్లు తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏమీ ఇవ్వలేదని, అభివృద్ధి కోసం ఎన్నో అడిగితే ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ సెటైరికల్‌గా మాట్లాడుతున్నారు. పలు సభల్లో ఈ వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తుంటే.. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా చేసిన ట్వీట్ ఇంటలెక్చువల్స్‌ని మరింత ఆలోచనలో పడేసింది. వాస్తవంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది.. అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో తలెత్తుతోంది. సీఎం రేవంత్ తన వ్యక్తిగత ట్విట్టర్‌లో పోస్టు చేసిన వివరాలు ఇలా ఉన్నాయి..
సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ పాయింట్స్…