మాజీ ముఖ్యమంత్రికి రేవంత్ నివాళి
ఆయన చేసిన సేవలన స్మరించుకున్న సిఎం
నిజమైన కాంగ్రెస్ లోకి రావాలని పిలుపు
ప్రధాని పదవికి అడుగు దూరంలో రాహుల్ గాంధీ
ఆంధ్రప్రభ – హైదరాబాద్ – వైఎస్సార్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో నేడు జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు.. ఇక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ, వైఎస్సార్ ముద్ర ప్రజల గుండెల్లో భద్రంగా ఉందన్నారు. సంక్షేమం అంటే వైఎస్సార్ గుర్తుకొస్తారని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు వైఎస్సార్ సంక్షేమమే స్ఫూర్తి అని అన్నారు. వైఎస్సార్ భౌతికంగా ప్రజల మధ్య లేకున్నా ఆయన స్ఫూర్తి బతికే ఉంటుందన్నారు. వైఎస్ అకాల మరణం కాంగ్రెస్ కు తీరని లోటన్నారు. వైఎస్సార్ నిజమైన వారసులు కాంగ్రెస్ లో కి రావాలని సూచించారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తాని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి వైఎస్సార్ ఎంతో కృషి చేశారని చెప్పారు. రాహుల్ జోడో యాత్రకు వైఎస్సార్ పాదయాత్ర స్ఫూర్తి అని వెల్లడించారు.
ప్రధాని పదవికి ఒక్క అడుగు దూరంలో రాహుల్
ప్రధాని పదవికి రాహుల్ ఒక్క అడుగు దూరంలో ఉన్నారని చెప్పారు సీఎం రేవంత్. రాహుల్ ను ప్రధానిని చేసే వరకు కార్యకర్తలు కష్టపడాలని కోరారు. రాహుల్ ప్రధాని అయితేనే పేదలకు మేలు జరుగుతుందన్నారు.రాహుల్ ను ప్రధాని చేయడమే లక్ష్యమని వైఎస్సార్ చెప్పారన్నారు.
పంజాగుట్టలో..
దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.