Friday, November 22, 2024

Breaking: పోచారం ఇంటికి రేవంత్… కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా ఆహ్వానం

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను, కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలోకి లాగాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్‌ రెడ్డి, పొంగులేటి.

పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గం నుంచి 2009 నుంచి 2023 వరకు వరసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎంపిక కావడం విశేషం. ఆ క్రమంలోనే పోచారం తెలంగాణ ప్రభుత్వంలో 2014-2019 వరకు వ్యవసాయ మంత్రిగా, 2019 జనవరి 17 నుంచి 2023 డిసెంబర్ 6 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement