Thursday, December 12, 2024

TG | తెలంగాణ త‌ల్లి విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ.. కేసీఆర్ ను ఆహ్వానిస్తాన‌న్న రేవంత్

హైదరాబాద్: స‌చివాల‌యంలో ఈనెల తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.. ప్ర‌భుత్వ ప‌రంగా నిర్వ‌హించ‌నున్న ఈ వేడుక‌కు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. హైద‌రాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనను ఆహ్వానిస్తారని పేర్కొన్నారు. ఇవాళ‌ ఇందిరమ్మ ఇళ్ల యాప్ లాంఛ్ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ… ప్రతిపక్ష పార్టీలు అంటే శత్రువులన్నట్టుగా కేసీఆర్ క్రియేట్ చేశారని.. కానీ ప్రభుత్వం అంటే ఒక్క కాంగ్రెస్ సభ్యులే కాదని.. 119 మంది ఎమ్మెల్యేలని అన్నారు.

సభలో అధికార పక్షానికి, ప్రతిపక్షానికి సమప్రాధాన్యం ఉంటుందన్నారు. కేసీఆర్‌ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలని.. ప్ర‌భుత్వానికి విప‌క్షాల నుంచి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ప్రతిపక్ష నేత స్థానం ఖాళీగా ఉండటం బాగోలేదని.. పాలక పక్షానికి సూచనలు చేయాలని ప్రశ్నించాలని కోరారు.

కేసీఆర్‌ కంటే మేం జూనియర్‌ శాసనసభ్యులమేనన్నారు. కేసీఆర్ ఆ పెద్దరికం ఎందుకు నిలబెట్టుకోవడం లేదని.. ఇకనైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరారు. ఈనెల 9వ తేదీ నుండి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ హాజరు కావాలన్నారు. మీ పిల్లలు తప్పుచేస్తుంటే ఎందుకు ఆపడం లేదని.. రాక్షసులను తయారుచేసి మా మీదకు ఉసిగొల్పడం మంచిదా అని ప్రశ్నించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement