హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయి)కు సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1న 83వ నుమాయిష్ ప్రారంభానికి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు కొనసాగనుంది. ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సుమారు 2,400 స్టాళ్లు కొలువుదీరనున్నాయి.
ఒకేచోట అన్ని వస్తువులు..
ఎగ్జిబిషన్‌లో అన్ని రకాల వస్తువులు ఒకేచోట లభ్యమవుతాయి. నగరంలో దొరకని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దుస్తులు, బెడ్ïÙట్లు, కిచెన్‌వేర్ , మహిళల కోసం పలు విధాల వంట సామగ్రి, వివిధ రకాల దుప్పట్లు, బెడ్‌షీట్లు, కశీ్మరీ డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, వివిధ రకాల కొత్త తరహా ఫరి్నచర్స్, పలు విధాల ఉపయోగపడే పలు రకాల సామగ్రి అందుబాటులో ఉంటాయి. కాగా ఈ ఏడాది టిక్కెట్ ధరను రూ.40గాని ర్ణయించారు.