Tuesday, November 19, 2024

Orders – లైంగిక దాడి – హత్య – ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కు రేవంత్ ఆదేశం

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ అమ్మాయి అత్యాచారం, హత్య ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు.

పోక్సో చట్టాన్ని, ఐపీసీ చట్టాన్ని వినియోగించి, ఫోరెన్సిక్‌ను సమర్థంగా వాడుకొని కేసును పకడ్బందీగా విచారణ చేసి అతిత్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన అమానుష ఘటనపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంటనే ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement