హైదరాబాద్ మాజీ ఆర్చ్ బిషప్ తుమ్మబాల (80) అనారోగ్యంతో గత రాత్రి కన్నుమూశారు. వరంగల్ బిష్పగా 25 ఏళ్ల పాటు పనిచేసిన తుమ్మబాల అంత్యక్రియలు నేడు నిర్వహించారు… సికింద్రాబాద్ సెయింట్ మేరీ బసిలికీలో తుమ్మబాల పార్థివశరీరానికి అంతిమ క్రతువు జరిపారు..
నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ …
సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ స్కూల్లో అంతిమ యాత్ర కోసం ఉంచిన తుమ్మబాల భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. శవ పేటికపై పుష్ప గుచ్చం ఉంచి అంజలి ఘటించారు.. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. సమాజ నిర్మాణంలో తుమ్మబాల ఎనలేని సేవలందించారన్నారు. ప్రజలకు శాంతి, మత సామరస్యం, విద్యను అందించారన్నారు. వ్యక్తిగతంగా తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు.
కాగా.. 2019 ఎంపీ ఎన్నికల్లోనూ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమను మంచి మనసుతో ఆశీర్వదించారని చెప్పారు. వారి ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఆయన మరణం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. వారి సేవలను కొనియాడుతూ.. వారి సందేశం స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఆయన సేవలు మరవలేనివన్నారు. ఇన్ని రోజులు ఆయన ఇచ్చిన సందేశాన్ని అందరూ పాటించి ముందుకు సాగాలని సీఎం తెలిపారు.
కాగా, వరంగల్ జిల్లా నర్మెట్టలో 1944 ఏప్రిల్ 24న జన్మించిన తుమ్మ బాలను పోప్ సెయింట్ జాన్పాల్ 2 ద్వారా 1986 నవంబరు 17న వరంగల్ రెండో బిషప్ గా నియమితులయ్యారు. అనంతరం పోప్బెనడిక్ట్ తుమ్మ బాలను 2011 మార్చి 12న హైదరాబాద్ ఆర్చ్ బిషప్ గా నియమించారు.