Thursday, November 28, 2024

TG | కుటుంబ వివ‌రాల‌ను న‌మోదు చేయించుకున్న రేవంత్ రెడ్డి

  • స‌ర్వే న‌మోదు పురోగ‌తిపై ఆరా
  • ప్ర‌జ‌ల స్పంద‌న ఎలా ఉందంటూ ప్ర‌శ్న‌లు
  • అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల కోసం ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించాల‌ని అదేశం


హైద‌రాబాద్ – తెలంగాణ‌లో కుటుంబ స‌ర్వే న‌మోదు కార్య‌క్ర‌మం జోరుగా కొన‌సాగుతున్న‌ది.. దీనిలో భాగంగా ఇవాళ‌ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇంలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డిలు ఎన్యుమ‌రేట‌ర్ల‌తో క‌ల‌సి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు.. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను ఎన్యుమ‌రేట‌ర్ల‌కు అందించి వాటిని న‌మోదు చేయించుకున్నారు రేవంత్. ఈసంద‌ర్భంగా త‌న ఇంటికి వ‌చ్చిన అధికారుల‌ను సర్వే పురోగతిపై వివ‌రాల అడిగి తెలుసుకున్నారు.. అలాగే స‌ర్వేపై ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని అధికారులను ఆరా తీశారు.

అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్…
కాగా, హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని అధికారులను కోరారు. వీలైనంత త్వరగా కుల సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల‌కు సూచించారు రేవంత్.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement