కొడంగల్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాను పోటీచేసే స్థానంపై క్లారిటీ ఇచ్చారు. ఈ టెర్మ్ కొడంగల్ నుంచి పోటీకి దిగుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరుకు ఈ రోజు దరఖాస్తు పెడుతున్నామన్నారు. తన తరఫున స్థానిక నేతలు దరఖాస్తు చేస్తున్నారు. కొడంగల్ అభివృద్ధిని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా 2018లో కొడంగల్ నుంచి పోటీ చేసి రేవంత్ రెడ్డి ఓడిపోయారు. అనంతరం మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న కొడంగల్ ఎంపీపీ, కొడంగల్ మున్సిపల్ చైర్మన్
కాగా, బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లోకి కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశ్ ముఖ్, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగ్గప్ప, ఎంపీటీసీలు, పలువురు కార్యకర్తలు నేడు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.. వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి..
ఈ సందర్బంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ,
దాడులు చేసి ఎన్నికల్లో గెలవలనుకునే వారికి ప్రజలు గుణపాఠం చెబుతారు..
కొడంగల్ ను దత్తత తీసుకుంటామని ఆనాడు కేసీఆర్ మాట ఇచ్చి మోసం చేశారు.
హైదరాబాద్-బీజాపూర్ హైవే తెచ్చింది నేను..
కొడంగల్ లో కట్టిన గుడి, బడి అన్నీ నా హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే.
కొడంగల్ కు తాగునీరు తెచ్చి దాహార్తిని తీర్చింది నేను కాదా?
కొడంగల్ నియోజకవర్గానికి 30 సబ్ స్టేషన్లు తెచ్చింది మేము..
కొడంగల్ ప్రజలకు బస్ డిపో తెచ్చింది మేము…
నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి మా హయాంలోనే జరిగింది.
బీఆరెస్ హయాంలో నారాయణ్ పేట్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయకుండా కొడంగల్ కి అన్యాయం చేశారు..
నేను చేసిన పనులకు శిలాఫలకాలు వేయడం తప్ప బీఆరెస్ చేసిందేం లేదు.
జిల్లాలు పెంచి కొడంగల్ ను ముక్కలు చెక్కలు చేశారు.
కేసీఆర్, కేటీఆర్ దత్తత తీసుకుంటే కొడంగల్ కు ఏం జరిగింది?
రెండేళ్లలో కృష్ణా జలాలు తెచ్చి కాళ్లు కడుగుతామన్న కేసీఆర్…
ఐదేళ్లయినా ఎందుకు తీసుకురాలేదు.
లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కట్టకుండా కొడంగల్ కు నీళ్లు రావు
కనీసం మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలను కూడా నిర్మించలేదు.
మరోసారి కొడంగల్ ప్రజలను మోసం చేయాలని బీఆరెస్ భావిస్తోంది.
మీరు దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరు..
మీరు చేతితో కొడితే.. ప్రజలు మిమ్మల్ని చెప్పుతో కొడతారు.
దాడులు చేయడం మా విధానం కాదు… అభివృద్ధి చేయడమే మా విధానం..
పేదల జీవన ప్రమాణాలు పెంచి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే మా విధానం..
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందించడమే మా విధానం..
ప్రతీ నెలా మొదటి తారీఖున రూ.4వేలు పెన్షన్ ఇవ్వడం మా విధానం
ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు సాయం చేయడం మా విధానం
రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకోవడం మా విధానం
కేసీఆర్ ఒడిపోతుండు కాబట్టే గజ్వేల్ నుంచి పారిపోతుండు..
కేసీఆర్ ఓటమి ఖాయమైంది కాబట్టే ఆపద మొక్కులు మొక్కుతుండు
ఓటమి భయం కేసీఆర్ గొంతులో స్పష్టంగా కనిపిస్తోంది.
కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదించుకుంది… హైదరాబాద్ చుట్టూ 10వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు.
గుర్నాథ్ రెడ్డి సూచనతో నేను కొడంగల్ నుంచే పోటీకీ ఇవాళ గాంధీభవన్ లో దరఖాస్తు చేస్తాం
మీరంతా ఆశీర్వదించాలని కోరుతున్నా.. అంటూ పేర్కొన్నారు ..
భారీ మెజార్టీతో రేవంత్ ను గెలిపించుకుంటాం – మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి
కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి అన్నారు.. కొడంగల్ లో రేవంత్ రెడ్డి ని గెలిపించే బాధ్యత అందరం తీసుకున్నామని చెప్పారు.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చారని అంటూ ఈ సారి కొడంగల్ కాంగ్రెస్ దేనని తేల్చి చెప్పారు.. కాంగ్రెస్ వాళ్లు కనిపిస్తే కొట్టాలని ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అంటున్నారని, ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు..