తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. సీఎల్పీగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అగ్రనాయకత్వం ఢీల్లీలో ప్రకటించింది.
రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ నెల 7న(గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.