Saturday, November 16, 2024

రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. యాదవ కురుమ జేఏసీ

యాదవ కురుమలతో పాటు యావత్ తెలంగాణ రైతాంగం ఆత్మగౌరవం దెబ్బతినేలా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని యాదవ కురుమ జేఏసి నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల రేవంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బుధవారం నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు.. అనంతరం ధర్నా చౌక్ నుండి పాత కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజారామ్ యాదవ్, యాదవ కురుమ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. దేశంలో నాగరికతకు వ్యవసాయమే మూలమని భారత దేశంలో వ్యవసాయాన్ని మొదట దున్నపోతులతోనే చేశారని దున్నపోతులు, బర్రెలు, ఎద్దులు ఆవులు భారతీయ సంస్కృతిలో ఒక భాగమని పేర్కొన్నారు.

దేశంలో యాదవులు పశుపాలన ద్వారా పాలు పెరుగు వెన్న నెయ్యి సమాజానికి అందించారని తెలిపారు. పేడను ఎరువుగా మార్చి వ్యవసాయరంగా అభివృద్ధికి కృషి చేసిన ఘనత యాదవులదేనని రేవంత్ రెడ్డి గుర్తించాలని హెచ్చరించారు. వ్యవసాయాన్ని మట్టిని పీడనొప్పించపరచడం అంటే సమస్త శ్రామిక వర్గాన్ని ముఖ్యంగా రైతాంగాన్ని విమర్శించడమేనని రేవంత్ రెడ్డి ఆత్మ విమర్శన చేసుకోవాలని పేర్కొన్నారు. యాదవులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరించారు. ఈనెల 24వ తేదీ లోపు రేవంత్ రెడ్డి యాదవులకు క్షమాపణ చెప్పాలని లేకుంటే తెలంగాణ రాష్ట్రంలోని యాదవ సైన్యం అంతా కదిలి గాంధీభవన్ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయమై రాకపోకలు స్తంభించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ సంఘం నాయకులు కడారి అంజయ్య గోస శ్రీనివాస్, యాదవ్ గోవర్ధన్, లాలు యాదవ్ యాదవ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేక రాములు,, యాదవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement