Tuesday, November 26, 2024

Revanth Reddy – జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి …రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే ..

ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేత‌ రేవంత్‌ రెడ్డి పేరు మారుమోగిపోతోంది. ఆర్ఎస్ఎస్‌ అనుబంధంతో మొదలుకొని జిల్లాపరిషత్‌కి ఎన్నికవ్వడం, తెలంగాణాలో మొదటిసారిగా కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడం వరకు జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఆరోపణలు ఎదురైనా.. ఏ మాత్రం తగ్గకుండా తనదైన శైలిలో ఎదుర్కొంటూ పార్టీని అధికారంలోకి తీసుక‌రావ‌డంలో కీల‌క పాత్ర పోశించారు.

ఓ ప‌త్రిక‌లో జ‌ర్న‌లిస్టుగా..
టీపీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సామాజిక సేవ‌తోనే కాకుండా ప్ర‌జ‌ల క‌ష్టాలను వెలికితీయ‌డంతో ముందుండాల‌నే దృక్ప‌థంతో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశారు. గ‌తంలో జాగృతి అనే వార్త ప‌త్రిక‌లో ప‌నిచేశారు. ఇప్పుడు ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కాలేజీలో చ‌దువుకునే స‌మ‌యంలో రేవంత్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని వారి క‌ష్టాల్లో పాలు పంచుకునే త‌త్వం ఉండేది. దానిలో భాగంగానే ఎబీవీపీలో ప‌నిచేశారు. అనంత‌రం చ‌దువు పూర్తి చేసుకున్నా.. ప్ర‌జ‌ల‌కు త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తూనే.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో జ‌ర్న‌లిస్టుగా మారారు. అప్ప‌టి నుంచే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న ఉండేది. అక్ష‌రాలుగా క‌న్నీటి గాథ‌లుగా ప్ర‌జాప్ర‌తినిధుల ముందు చూపించేవార‌ని అప్ప‌ట్లో క‌లిసి ప‌నిచేసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. ఆ త‌ర్వాత స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచి త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టి ఎన్నో ప‌ద‌వులు పొందారు. రాజ‌కీయ అటుపోట్లు, ఒడిదుడుకుల‌ను ఎదుర్కొని జ‌ర్న‌లిస్టు నుంచి సీఎం రేసులో ఉండే స్థాయికి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement