Thursday, November 21, 2024

TG | రేవంత్ రెడ్డి వీధి రౌడీనే… బీఆర్ఎస్ నేతల గరంగరం

  • సమగ్ర కుటుంబ సర్వే పై స్పష్టత ఇవ్వాలి
  • పోరాటం చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు
  • మాజీ ప్రభుత్వ విఫ్ గొంగిడి సునీతా రెడ్డి, క్యామ మల్లేష్


ఆంధ్రప్రభ, ప్రతినిధి / యాదాద్రి : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని మాజీ ప్రభుత్వ విఫ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో సీఎం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేను ఒక్కరోజులో రాష్ట్రం మొత్తంలో 1.30 లక్షల కుటుంబాలకు 3,80 వేల మంది ఎన్యూమరేటర్లతో కుటుంబ సర్వే చేపట్టారని, అప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబ ఆర్ధిక, రాజకీయ, సామాజిక వివరాలు చెప్పొద్దని చెప్పి, ఇప్పుడు ఎందుకు సర్వే చేపడుతున్నారని ప్రశ్నించారు. 60రోజుల సమయం పెట్టడంతో పనులు మానుకొని ఉండాల్సిన పరిస్థితి ఉందని, పూర్తిగా పారదర్శకత లోపిస్తుందని చెప్పారు.

సీఎం అనాలోచిత నిర్ణయాలు, సమగ్ర ప్రణాళిక లేకపోవడంతో సర్వే సక్రమంగా జరగడం లేదన్నారు. సర్వేపై ప్రజలకు ఉపయోగం ఏమిటో స్పష్టంగా చెప్పాలని, పూర్తి అవగాహన కల్పించి, ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చి సర్వే చేయాలన్నారు. ఎస్సీ కులగణ‌న‌ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే నిండు సభలో మాట ఇచ్చి రాష్ట్రంలో ముందు చేసి ఆదర్శంగా నిలుస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు. పాలకుడు ఏ విధంగా మాట్లాడుతారో ప్రజలు కూడా ఆ విధంగానే మాట్లాడుతారని, దానికి నిదర్శనమే ఫార్మ హియరింగ్ లో అధికారులపై దాడులు జరిగాయని చెప్పారు. అంతర్జతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న రాష్ట్రాన్ని అబాసుపాలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డి కే దక్కుతుందన్నారు.

వీధి రౌడీలా రేవంత్ రెడ్డి వ్యవహారం.. భారాస రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్
సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని మరచి వీధి రౌడీలా వ్యవహారం ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… తన స్థాయి మరచి, సీఎం హోదాను వీడి బుల్డోజర్ తో తొక్కిస్తాం.. నరికేస్తాం.. పీకేస్తాం అని మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాష తీరు మార్చుకోవాలని, తెలంగాణ ప్రతిష్టతను దిగజార్చవద్దన్నారు. పాలన చేతకాక దేవుళ్ళ పై ఒట్లు వేయడం, పొలిటికల్ డైవర్షన్ కు పాల్పడడంతో కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు.

- Advertisement -

11నెలల కాలంలో ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని, ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని స్పష్టం చేశారు. మూసీ పై డీపీఆర్ తయారు చేయలేదని, తల తోక లేకుండా కిలోమీటర్ నడచి పాదయాత్ర అనడం సిగ్గుచేటన్నారు. రుణమాఫీ చేసి, రైతు బంధు, పింఛన్లు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మెన్ ఎనబోయిన ఆంజనేయులు, మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, మాజీ జడ్పీటీసీలు బీరు మల్లయ్య, తోటకూర అనురాధ, నాయకులు అతికం లక్ష్మినారాయణ గౌడ్, డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, ఎం వి కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, ఓం ప్రకాష్, త‌దిత‌రులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement