రైతుల ఉద్యమానికి తొలుత మద్దతునిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతంలో నిర్వహించిన బంద్ లలో కేటీఆర్ కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. మోదీని కలిశాకే కేసీఆర్ లో మార్పు వచ్చిందని చెప్పారు. ప్రధాని ఏం మాయ చేశారోగానీ.. సీఎం పూర్తిగా మారిపోయారని అన్నారు. భారత్ బంద్ లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ డిపో ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీల నేతలతో కలిసి పాల్గొన్నారు.
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారిందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తే.. ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాత్రం రైతులను బానిసలుగా మార్చిందని ఆరోపించారు.