బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్ర ఎందుకు ఆపేశారో బయట పెట్టాలని టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాండ్ చేశారు. కేసీఆర్ ఒత్తిడితోనే బండి సంజయ్ పాదయాత్ర రద్దు చేసుకున్నారని అన్నారు. బండి పాదయాత్ర ఆగపోవడానికి కారణం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినే అని చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డి.. ప్రధానితో మాట్లాడి బండి సంజయ్ పాదయాత్ర నిలిపివేయించారని చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రధానితో రహస్యంగా సమావేశమయ్యారని రేవంత్ తెలిపారు. మీడియాకు వెల్లడించకుండా జరిగిన ఈ సమావేశంలో మర్మం ఏమిటి అని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మాట్లాడితే ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీశారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు రహస్య స్నేహితులు అని పేర్కొన్నారు.
కృష్ణ జలాల వివాదంపై సుప్రీం సూచించిన మధ్యవర్తిత్వం పరిష్కారంపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం జరగకుండా ఉండాలనేదే తమ అభిప్రాయం అని చెప్పారు. పార్లమెంటును అడ్డుకోవడం తమ వైఖరి కాదన్నారు. పెగాసెస్ స్పైవేర్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 9 న ఇంద్రవెల్లి నుండి దళితుల దండోరా మొదలు పెడుతున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంపుపై కేంద్రం క్లారిటీ