Saturday, November 23, 2024

Revanth Reddy | 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ..

తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పోస్టుల భర్తీ బాధ్యత తమ మంత్రివర్గం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలు కూడా కాలేదన్నారు. ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రతిపక్షాలు అప్పుడే ఎగిరిపడుతున్నాయంటూ మండిపడ్డారు.

త్వరలోనే ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్

త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించే గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 7 వేల స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేశామన్నారు. ఇటీవల వారికి నియామక పత్రాలు అందించారని చెప్పారు. బిల్లా రంగాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత ఎంపీగా ఓడిపోతే ఆమెను ఎమ్మెల్సీగా జాబ్ ఇచ్చారని సెటైర్లు వేశారు. కానీ ఈ పదేళ్లలో అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉద్యోగాల కోసం శ్రమిస్తున్న నిరుద్యోగులు మీకు గుర్తురాలేదా అని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement