హైదరాబాద్ – రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ నిజాం నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను కెటిఆర్ మిత్ర బృందం కొల్లగొట్టిందని ఆరోపించారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో కెటిఆర్ ధరణి విషయంలో ఇచ్చిన వివరణపై రేవంత్ ఘాటుగా స్పందించారు.ని షేధిత జాబితాలో చేర్చిన భూములను ఎన్నివేల ఎకరాలు ధరణి జాబితా నుంచి తొలగించారో చెప్పాలన్నారు. అవి ఎవరెవరి పేర్ల మీద బదలాయించారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. తోట చంద్ర శేఖర్ ఆదిత్య కన్సక్షన్ కు ధరణి పేరుతో నిషేధిత భూములను బదలాయించుకున్నారని ఆరోపించారు రేవంత్.
మియాపూర్ లోని కోట్ల విలువైన ఐదేకరాల భూమి ఎంపీ బానోత్ కవితకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ భూమిని బదిలీ చేయడానికి రెడ్యా నాయక్ ను పార్టీ మార్పించింది వారి కూతురు కవిత అని.. కూతురు భూ దాహం కోసమే రెడ్యా నాయక్ పార్టీ మారారని ఆరోపించారు. ఈ విషయంపై తనతో చర్చకు రావాలని ఎంపి కవితకు సవాల్ విసిరారు.కాగా, తనపై ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం అని అంటూ, ఈ ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు.