Wednesday, November 20, 2024

TG : పొంగులేటికి రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్..

రాష్ట్ర‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని పొంగులేటి మర్యాదపూర్వకంగా సీఎంను సోమవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి పొంగులేటి ధన్యవాదాలు తెలిపారు.

మంత్రి పొంగులేటి పుట్టిన రోజు సందర్భంగా ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, మిత్రులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరూ బొకేలు, శాలువాలు లేకుండానే రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కరచాలనం ముద్దు అని పేర్కొన్నారు. బొకేలు, శాలువాలు, మెమోంటోలు, కేక్ లకు అయ్యే ఖర్చులను సమాజ, సామాజిక కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. అనవసరమైన ఖర్చులను తగ్గించాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement