Tuesday, November 19, 2024

TS: బీఆర్ఎస్ తో రేవంత్ రాజీ… ఎంపి ల‌క్ష్మ‌ణ్

కాళేశ్వ‌రంపై చ‌ర్య‌ల‌కు మంగ‌ళం
రేవంత్ పై విరుచుకుప‌డ్డ బీజేపీ ఎంపి ల‌క్ష్మ‌ణ్
అమిత్ షా వీడియో మార్ఫింగ్ లో రేవంత్ హ‌స్తం
రిజ‌ర్వేష‌న్ల‌కు తూట్లు పొడిచింది కాంగ్రెస్సే
దేశ విభ‌జ‌న‌కు కార‌ణం నెహ్రూనే

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి రాజీపడ‌డంతోనే కాళేశ్వరం ఫైల్ లను తొక్కి పెట్టారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… అధికారంలోకి వ‌చ్చి నాలుగు నెల‌లైనా ఇంత వ‌ర‌కూ కాళేశ్వ‌రం డ్యామేజ్ చేసిన వారిపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు.. బీఆర్ఎస్ తో కుమ్మ‌క్కు రాజ‌కీయాలు చేయ‌డం వ‌ల్లే ఆ ఫైల్ ను రేవంత్ బ‌య‌ట‌కు తీయడం లేద‌ని ఆరోపించారు.

కాగా, ఆర్ఎస్ఎస్ చీఫ్ రిజర్వేషన్ లు కొనసాగాలని స్పష్టంగా చెప్పారన్నారని గుర్తు చేస్తూ, రేవంత్ రెడ్డి మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు ? అని ప్రశ్నించారు. అబద్దాలనే ప్రచార అస్ట్రాలుగా మార్చుకున్నారని మండిపడ్డారు. ప్రజలు నమ్మక పోవడంతో ఫేక్ వీడియోలు చేశారన్నారు. తెలంగాణ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీతో సహా పార్టీ నేతలందరూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని మొదటి నుండి అవమానించిందన్నారు. మతపరమైన విభజనకు కారణం నెహ్రూ అన్నారు. ఈ రోజు సెక్యులరిజం గురుంచి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టే అని తెలిపారు.

రాజ్యాంగాన్ని ఇందిరాగాంధీ అవమానించినట్టు ఎవరు అవమానించలేదని కీలక వ్యాఖ్యలు చేశారు.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు అబద్దాలనే నమ్ముకున్నారని అన్నారు ల‌క్ష్మ‌ణ్. చైనా లాంటి దేశ సహకారంతో మార్ఫింగ్ జరిగిందా ? అని ప్రశ్నించారు. ఈ మార్ఫింగ్ లో రేవంత్, కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నట్టు బయట పడుతుందన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు తావు లేదని అంబేద్కర్ చెబితే తూట్లు పొడించింది కాంగ్రెస్ కాదా ? అని ప్రశ్నించారు.

- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ లో బీసీలకు 50 డివిజన్లు కేటాయిస్తే అందులో 31మంది ముస్లింలు గెలిచార‌ని, దీంతో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. ఒక్క మాదిగకు సీటు ఇవ్వకుండా మీరు ఏ విధమైన సామాజిక న్యాయం పాటించారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement