మెదక్ ప్రతినిది:ప్రభ న్యూస్ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో మెదక్ లో పర్యటించనున్నట్లు రాష్ట్ర అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తేలిపారు. కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ సందర్బంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి మెదక్ లో రోడ్ షో నిర్వహించి రాందాస్ చౌరస్తా లో నిర్వహించే సభ లో రేవంత్ ప్రసంగించనున్నట్లు మంత్రి తేలిపారు.
మెదక్ పట్టణంలో అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు లతో కలిసి హెలిప్యాడ్, రాందాస్ చౌరస్తా లో సభాస్థలిని పరిశీలించారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ నీలం మదు నామినేషన్ కు సీఎం హాజరుకానున్న నేపథ్యంలో హెలిప్యాడ్ సిద్ధం చేశామన్నారు.భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు నాయకత్వంలో కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
జనసమీకరణ కోసం ఆదేశాలు కార్యకర్తలకు ఆదేశాలిచ్చామన్నారు.మెదక్ ప్రసిద్ది గాంచిన నియోజకవర్గమన్నారు. మెదక్ గడ్డ ఇందిరాగాంధీ కి చేరదీసి ప్రధాని గా ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఉందన్నారు. మెదక్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు.రేవంత్ సభ విజయవంతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. బడుగు బడుగు బలహీన వర్గాల నేత నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు.
అనంతరం సీనియర్ నేత, మైనం పల్లి హన్మంత రావు మాట్లాడుతూముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సభ ను విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ను గేలిపించుకోని బిసిల ఐక్యత చాటుకోవాలన్నారు.
ఉమ్మడి జిల్లా లో ముదిరాజ్ లు మెజార్టీ ఉన్నారని, బిసి బిడ్డ అయిన నీలం మధు ముదిరాజ్ కు అండగా ఉంటామన్నారు.నీలం మదుకు మేమంతా అండగా ఉంటామన్నారు.
పంచాయతి మెంబర్ నుంచి వచ్చిన వ్యక్తి నీలం మధు అని కొనియాడారు.బిఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములు అమ్మి వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.గతంలో ఎలా ఉన్నారు. 120 రోజుల కాంగ్రెస్ పాలనను చూసి జీర్ణీంచుకోలేకపోతున్నారని ఆరోపించారు.మేము ప్రజలకు జవాబుదారి అని అయన పేర్కొన్నారు.కెసిఆర్ ఫ్యామిలీ అధికారంలో ఉండగా రాజు కుటుంబంలా వ్యవహారించిందన్నారు. ఇంకా వారికి అహంకారం దిగలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక వారు డిప్రెషన్ లోకి పోయారని ఆరోపించారు.కెసిఆర్ ఫ్యామిలీ ఏ లీడరు వద్దు అనుకున్నరని,అందుకే బిఆర్ఎస్ ఓటమి పాలైయిందన్నారు
.రాష్ట్రం లో బిఆర్ఎస్ పార్టీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్తానంకు పోతుందని విమర్శించారు. కెసిఆర్ కుటింబికులు చేసిన అవినీతి చిట్టా తీయడానికి ప్రస్తుతం ముఖ్య మంత్రికి సమయం లేదని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూసుకుంటామన్నారు. సెక్యులర్ సిస్టమ్ కాంగ్రెస్ పార్టీ లో మాత్రమేనన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి పల్లి ఆంజనేయులు,నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జీ ఆవుల రాజిరెడ్డి, దుబ్బాక ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తోడుపునూరి చంద్రపాల్, జిల్లా నాయకులు శ్రీనివాస్ చౌదరి,ప్రశాంత్ రెడ్డి, జీవన్ రావు ఆవుల గోపాల్ రెడ్డి, బొజ్జ పవన్,ఉప్పల రాజేష్,సుప్రభాత్ రావు, రమేష్ రెడ్డి,బట్టి సులోచన, హరిత, గోదల జ్యోతి, మెంగని విజయ లక్ష్మీ, శంకర్, గోవింద్, సురేందర్ నాయక్, రాగి అశోక్, రాగి వనజ, మంగ మోహన్ గౌడ్, మేడి మధుసూదన్, తాహేర్ తదితరులు పాల్గొన్నారు