Friday, November 22, 2024

TG: కేకేతో ఢిల్లీకి బ‌య‌లుదేరిన రేవంత్

నేడు కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న కేకే
హ‌స్తం తీర్థం పుచ్చుకున్న వెంట‌నే రాజ్య‌స‌భకు రాజీనామా
మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై ఖ‌ర్గే, రాహుల్ తో రేవంత్ చ‌ర్చ‌లు
పేర్లు ఖ‌రారు అయితే రేపే కొత్త మంత్రుల ప్ర‌మాణ స్వీకారం
బీఆర్ఎస్ కీల‌క నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు కేకే ఇవాళ‌ కాంగ్రెస్ లో చేర‌నున్నారు.. ఇప్ప‌టికే కారు పార్టీకి రాజీనామా చేసిన కేకే ఇప్పుడు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్ద‌ల స‌మ‌క్షంలో హ‌స్తం తీర్థం పుచ్చుకోనున్నారు.. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో క‌ల‌సి కే కేశ‌వ‌రావు ఇవాళ‌ ఉద‌యం విమానంలో ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లారు..

ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఇదే సమయంలో ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.. హ‌స్తం తీర్ధం తీసుకున్న త‌ర్వాత కేకే తన రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌నున్న‌ట్లు స‌మాచారం ..

ఖర్గేతో రేవంత్ భేటీ: మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై చర్చ‌లు..
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా తెలంగాణ మత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఇందుకు సంబంధించిన కసరత్తును దాదాపు పూర్తి చేసినట్లు స‌మాచారం. ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ చీఫ్, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకోబోతున్నారు..

- Advertisement -

ఎల్లుండితో ఆషాడ మాసం మొదలు కాబోతున్నది. దీంతో రేపు ఒక్కరోజే అవకాశం ఉండటంతో ఈ అంశాలపై ఇవాళ తుది నిర్ణయం తీసుకుంటే రేపు ప్రమాణ స్వీకారం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రివర్గంలో చోటు, పీసీసీగా ఛాన్స్ కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నందున అధిష్టానం ఎవరికి యస్ చెప్పబోతున్నదని మరెవరికి నో చెప్పనున్నదనేది కాంగ్రెస్ పార్టీలో సస్పెన్స్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement