Tuesday, October 29, 2024

Telangana – కేసీఆర్.. నీ పోరంబోకు మాటలు ఆపు – రేవంత్ రెడ్డి

ప్రజలు ఇప్పుడు నిన్ను నమ్మి స్థితిలో లేరు
రూ.1500 కోట్ల ప్రజల సొమ్ము పార్టీ ఫండ్ పేరుతో మీ ఖాతాలో ఉంది
అందులోంచి కనీసం రూ100 కోట్లయినా బాధిత రైతులకు పంచు
నీది కపట ప్రేమ కాదని తేలిపోతది
కేసీఆర్​ పదేళ్ల విధ్వంసం పాలనను ప్రజలు మరువలేదు
ప్రతిపక్షం తీరుపై సీఎం రేవంత్ ద్వజం

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : కేసీఆర్.. నీ పోరంబోకు మాటలు ఇకనైనా ఆపు.. లేదంటే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారు.. అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితవు పలికారు. మొన్నటికి మొన్న ఓటమి పాలైనా నీకు బుద్ది రాలేదా.. అని ప్రశ్నించారు. ప్రజలు ఇప్పుడే నిన్ను నమ్మి స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. రూ.1500 కోట్ల ప్రజల సొమ్ము పార్టీ ఫండ్ పేరుతో మీ ఖాతాలో ఉందని గుర్తు చేస్తూ.. అందులోంచి కనీసం రూ.100 కోట్లయినా బాధిత రైతులకు పంచిపెడితే నీది కపట ప్రేమ కాదని తేలిపోతది.. అని రేవంత్ చురకలంటించారు.

మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో నిర్వహించే జనజాతర సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్​ రెడ్డి పర్యవేక్షించారు. సీఎం తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్​ పదేళ్ల విధ్వంసం పాలనను ప్రజలు మరువలేద అన్నారు. ప్రతిపక్షం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్​ పార్టీకి ఎంతో ప్రత్యేకమని అన్నారు.

జాతీయ మేనిఫెస్టో ప్రకటనకు తెలంగాణను ఎంచుకున్నందుకు ఏఐసీసీ అధినాయకత్వానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్​ పార్టీకి ఎంతో ప్రత్యేకమని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది సోనియాగాంధీ వల్లేనని పేర్కొన్నారు. ఈనెల 6న ఇక్కడే జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని రేవంత్​ రెడ్డి తెలిపారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి ముఖ్య నేతలంతా వస్తారని వెల్లడించారు. జాతీయ మేనిఫెస్టో ప్రకటనకు తెలంగాణను ఎంచుకున్నందుకు ఏఐసీసీ అధినాయకత్వానికి సీఎం రేవంత్​ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.

రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల మంది ఈ సభకు తరలి రావాలని సీఎం పిలుపునిచ్చారు.గతంలో ఆరు గ్యారంటీలను తుక్కుగూడ సభలోనే ఇచ్చామని గుర్తు చేశారు. ఆరు హామీల్లో ఐదింటిని ఇప్పటికే అమలు చేసి చూపించామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు, సిలిండర్​, 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ అమలు వంటివి ప్రవేశపెట్టామన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్​ పార్టీయేనని కొనియాడారు. మహిళా విభాగానికి సంబంధించిన ఏర్పాట్లను సీతక్క, కొండా సురేఖ దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా పదేళ్ల కేసీఆర్​ పాలనపై నిప్పులు చెరిగారు. కేసీఆర్​ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని సీఎం రేవంత్​ ధ్వజమెత్తారు. కేసీఆర్​ ఇప్పటికైనా పొలంబాట పట్టడం సంతోషకరమైన విషయమని అన్నారు. పదేళ్ల తర్వాతనైనా రైతులు, వ్యవసాయం ఆయనకు గుర్తుకు వచ్చినందుకు సంతోషకరమైన విషయం అని ఎద్దేవా చేశారు. అధికారం పోయాక, బిడ్డ జైలుకు వెళ్లాక కేసీఆర్​కు ప్రజలు గుర్తుకు వచ్చారన్నారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్​కు వానకాలం ఎప్పుడు వచ్చేది తెలియదా.. అంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు.

- Advertisement -

కాంగ్రెస్ జనజాతర ఏర్పాట్లను ప‌రిశీలించిన రేవంత్
తుక్కగూడలో ఈ నెల ఆరున జరిగే జనజాతర ఏర్పాట్లను స్వయంగా రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సభకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. అదే రోజున జాతీయ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు. ఈ సభ వేదికగా పార్టీలోకి భారీగా చేరికలు ఉండ‌నున్నాయి. సుమారుగా పది లక్షల మందితో సభ నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తో్ంది. జనసమీకరణ ఏర్పాట్లలో కాంగ్రెస్ నేత‌లున్నారు. . తుక్కుగూడ సభలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ 5 గ్యారంటీలను ప్రకటించనుంది. తెలంగాణలో 14 ఎంపీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ బరిలోకి దిగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement