హైదరాబాద్ – రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుర్చీ కదులుతుందనే ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ అయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఢిల్లీ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని.. కేవలం కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల జరుగుతున్నాయని ఢిల్లీలో మకాం వేశారన్నారు. .
ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయని, కానీ పత్రికల్లో, మీడియాలో రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లొంగిపోయారని వ్యాఖ్యానించారు. . ఇప్పటికే రూ.100 కోట్ల లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ పై మోడీ విచారణ జరిపిస్తున్నారు. కానీ లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ ను ఎందుకు విచారణ చేయడం లేదు? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆరెస్ ది ఫెవికాల్ బంధం అన్నారు రేవంత్