Saturday, November 23, 2024

మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి . రేవంత్ రెడ్డి

కామారెడ్డి ప్రభన్యూస్. … 30 లక్షల మంది నమోదు చేసుకున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు అన్నింటిని లీక్ చేశారని. అందుకు బాధ్య‌త‌వ‌హిస్తూమంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్కాజ్గిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం రాజంపేట మండల కేంద్రంలో శనివారం నాడు జరిగిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు . తెలంగాణ త్యాగైన నీళ్లు నిధులు నియామకాలలో అన్నిట్లో విఫలమయ్యారని
తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ తెచ్చిన అని కేసీఆర్ అబద్ధం చెప్పినా రెండు సార్లు అవకాశం ఇచ్చార‌ని అన్నారు. నోటికొచ్చిన అబద్దాలతో గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజల గుండెలపై తంతున్నారన్నారు.

30లక్షల మంది నిరుద్యోగులు టీఎస్ పీఎస్సీలో నమోదు చేసుకున్నారనీ, ఆత్మహత్యలు చేసుకున్నా నిరుద్యోగుల సమస్యను కేసీఆర్ పరిష్కరించలేదన్నారు. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పోరాడితే, 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారనీ వివ‌రించారు.. రాష్ట్రంలో ఎంసెట్, ఏఈ, సింగరేణి, విద్యుత్ శాఖ, గ్రూప్-1 పేపర్లు లీక్ అయ్యాయన్నారు. రాష్ట్రంలో ఏ పరీక్షలు చూసినా పేపర్ లీకులే అన్నారు. బీఆర్ఆర్ఎస్ దొంగలు, పైరవీకారులకు ముందే ప్రశ్నపత్రాలు అందుతున్నాయనీ ఆరోపించారు. పేపర్ లీక్ వ్యవహారంలో చిన్న చేపలను బలి చే సి చైర్మన్, బోర్డు మెంబర్లు, కేటీఆర్, కేసీఆర్ తప్పించుకుంటున్నారనీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పరీక్ష పేపర్ లీకేజ్ కు కారణం కేటీఆర్ అని, కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. బిడ్డ కోసం మంత్రులను ఢిల్లీ కి పంపించిన కేసీఆర్, పేపర్ లీకేజీపై ఎందుకు సమీక్షించలేదు? ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్, కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. పేపర్ లీక్ వ్యవహారంపై 22న కాంగ్రెస్ ముఖ్య నేతలమంతా గవర్నర్ ను కలుస్తామ న్నారు.
బీఆరెస్, బీజేపీ కుమ్మక్కు ఏమిటో అమీతుమీ తేల్చుకుంటామ న్నారు. నిరుద్యోగుల జీవితాలు ఆగమైతుంటే గవర్నర్ ఎందుకు సమీక్షించడం లేదు? ప్రశ్నించారు. తక్షణమే టీఎస్ పీఎస్సీ సభ్యులను రాజీనామా చేయించి సిట్టింగ్ జడ్జి తో, లేదా సీబీఐ తో విచారణ చేయాల న్నారు. పరీక్షల్లో అవకతవకలపై కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. కేసీఆర్ పాలనకు ఇక కాలం చెల్లిందనీ దేవుడు కూడా కేసీఆర్ పక్షాన లేడన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement