కామారెడ్డి/మాచారెడ్డి ప్రభన్యూస్ ఏప్రిల్26 – పడి రైతులు పంట నష్టపోతే, మరోవైపు ఆత్మీయ సమావేశాలు అంటూ బీఆర్ఎస్ నేతలు తాగుబోతు సమావేశాలు నిర్వహిస్తూ రైతులను పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. పొందుర్తి గ్రామంలో అకాల వర్షం, వడగాండ్ల వాన కారణంగా నష్టపోయిన వరి పంట రైతులను ఆయన పరామర్శించారు. నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలని అన్నారు. ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ హామీలు ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. అప్పటి కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసిందన్నారు.
అనంతరం రైతులతో కలిసి ధాన్యం కుప్పలను, పరిశీలించారు. పొలాలను రేపటి నుండి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు రైతుల వివరాలు అడిగి తెలుసుకుని వారికి భరోసా కల్పించాలని కోరారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. రానున్న 6 నెలల్లో ఇందిరమ్మ రాజన్న రాజ్యం వస్తుందని, రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు.కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి షబ్బిర్ అలీ, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్చార్జి సుభాష్ రెడ్డి, టీపీసీసీ నాయకులు ఇంద్ర కరణ్ రెడ్డి, కైలాష్ శ్రీనివాస్, మండల అధ్యక్షులు యాదవ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు..