Friday, November 22, 2024

TG – నిరుద్యోగుల కోసం దీక్ష చేయండి – కేటీఆర్, హరీశ్ లకు రేవంత్ సవాల్

ఆంధ్రప్రభ – మహబూబ్ నగర్ – డిఎస్సీ పరీక్షల వాయిదా డిమాండ్లో న్యాయం ఉంటే కేటీఆర్, హరీశ్రరావు దీక్షలో కూర్చోవాలని ముఖ్యమంత్రి రేవంత్ సవాల్ చేశారు. ‘ఎప్పుడు పేద విద్యార్థులే ఎందుకు నిరాహార దీక్షలు చేయాలి. ఈసారి దీక్ష చేసేందుకు కేటీఆర్, హరీశ్ రావులను నిరుద్యోగులు ఆహ్వానించాలి. వారిద్దరూ దీక్షకు కూర్చుంటే రక్షణ కల్పిస్తాం’ అని పేర్కొన్నారు.

మహబూబ్ నగర్ లో ఆయన మాట్లాడుతూ,.విద్యార్థుల చావుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. డీఎస్సీ వాయిదా పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు

కేసీఆర్ రాజకీయంగా బలహీనం అయినప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు.పరీక్షలు వాయిదా వేస్తే పేద నిరుద్యోగులు నష్టపోతారని రేవంత్ రెడ్డి అన్నారు

- Advertisement -

.కేసీఆర్ 10 సంవత్సరాలలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ వేసింది లేదని విమర్శించారు. యువకులు మధ్యవయస్కులుగా మారిపోయారు అని అన్నారు. కోచింగ్ సెంటర్లను వెంటేసుకుని కేసీఆర్ హరీష్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అన్నారు. తాము 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.4 రోజులుగా కేటీఆర్, హరీష్ రావు మోదీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేశాయని రేవంత్ ఆరోపించారు. .

‘ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారని కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆయన తన పార్టీలో చేర్చుకోలేదా? ఈ ప్రభుత్వం 3 నెలలకే కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అనలేదా? ఇక ఆయనకు రాజకీయ మనుగడ లేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement