కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ధరణి పోర్టల్ ను భూమాతగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే పైలట్ ప్రాజెక్ట్ కింద సాగర్ లోని ఓ మండలం ఎంపికకు నిర్ణయం తీసుకుంది. వయనాడ్ మృతులకు తెలంగాణ కేబినెట్ సంతాపం తెలిపింది. వయనాడ్ బాధితులకు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించింది. అలాగే సిరాజ్, నిఖత్ జరీన్ లకు డీఎస్పీ ఉద్యోగాలిస్తూ నిర్ణయం తీసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టుకు రూ.437కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
- Advertisement -