Tuesday, November 12, 2024

TS: రేవంత్.. చిల్లర రాజకీయాలు మానుకో.. ఎంపీ అర‌వింద్

నిజామాబాద్ ప్రతినిధి, మే 1 (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించు.. చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ హితవు పలికారు. ప్రధాని మోడీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బుధవారం నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… ఒకవైపు ప్రపంచ దేశాలు సైతం ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి.. ప్రపంచానికే ఆదర్శ నాయకుడిగా అన్ని దేశాలు మరోసారి మోడీ ప్రధాని కావాలని ఎదురు చూస్తుంటే.. కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోదీపై మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌మకు పదవులపై ఆశ లేదు.. ప్రజలకు సేవచేసే మంచి నాయకుడు కోసం వచ్చామన్నారు. రేవంత్ భాష, కేసీఆర్ భాష రెండు ఒకేలా ఉన్నాయ‌న్నారు. రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలని ధ్వజమెత్తారు.

తీరు మారకుంటే రేవంత్ రెడ్డి చరిత్రలో 420లా మిగిలిపోతావని విమర్శించారు. దేశంలోనే అత్యంత ఎజెండాతో ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయన్నారు. అమలు కానీ హామీలు ఇచ్చి ఆరుగ్యారెంటీలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కాలయాపన చేస్తున్నాడు తప్ప చేసిందేమీ లేదన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో రేవంత్ రెడ్డి రోజుకో ప్రకటన చేస్తున్నారన్నారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని వేసిన కమిటీ.. టైం పాస్ చేయడం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభి వృద్ధి శూన్యమని మండిపడ్డారు.

పసుపు బోర్డుపై పదేపదే రాలేదని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు… ఇందూరు గడ్డపైనే పసుపు బోర్డు అని ధర్మపురి అరవింద్ నొక్కి చెప్పారు. అవగాహన రాహిత్యంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. అధికార యావ కోసం కాంగ్రెస్ నాయకులు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. జీవన్ రెడ్డి 17సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నావ్ వయసుకు తగ్గట్టు మాట్లాడు.. రోజుకో అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేయకని అన్నారు. భారీ మెజార్టీతో బీజేపీ ఘన విజయం సాధిస్తుం దని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పోతనకర్ లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement