Friday, November 8, 2024

Revanth Announce – టీటీడీ త‌ర‌హా పాల‌క మండ‌లి బోర్డు – ఇక యాదాద్రి ‘యాదగిరి గుట్ట’ ..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, యాదాద్రి భువ‌న‌గిరి : టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట ఆల‌య పాల‌క మండ‌లి బోర్డు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం ఇక్క‌డకు వ‌చ్చిన ఆయ‌న యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యం ఉండేలా ఏర్పాటు చేయనున్నామ‌ని, ఇందుకు పూర్తి అధ్య‌య‌నం చేసి ఏర్పాటు చేస్తామ‌న్నారు.

యాద‌గిరి గుట్ట‌గా మార్పు
యాదాద్రిని యాద‌గిరి గుట్ట‌గా పేరు మార్పు చేస్తున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు అన్నిరికార్డుల్లో ఇక నుంచి యాద‌గిరి గుట్ట‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశించారు. గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఆదేశించారు.

కొండ‌పై భ‌క్తులు నిద్ర‌చేసేలా చ‌ర్య‌లు
యాద‌గిరిగుట్ట వ‌చ్చిన భ‌క్తులు రాత్రి కొండ‌పై నిద్ర చేసి ఉద‌యం మొక్కులు తీర్చుకునే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు. గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం లేద‌ని గుర్తు చేశారు.
కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్న ఆదేశించారు.

భూసేక‌ర‌ణ పూర్తి చేయాలి
ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలన్న సీఎం ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాల‌న్నారు. మరో వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్ తో రావాలని సూచించారు.
ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి రిపోర్ట్ ఇవ్వాల‌న్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement