టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో సీఎంఆర్ పేరుతో రైస్ మిల్లుల్లో అవకతవకలు జరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రతి ఏటా రూ.100 కోట్ల ధాన్యం స్కాంకి పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, ఎఫ్‌సీఐకి సరఫరాలో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వంలోని ముఖ్యులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారని లేఖ ద్వారా ఆరోపించారు. బియ్యం రీ సైక్లింగ్‌పై సీబీఐ విచారణ జరపాలని సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement