Sunday, December 22, 2024

Revange – కుమార్తెపై లైంగిక దాడి – హనీ ట్రాప్ తో నిందితుడ్ని లేపేసిన పేరెంట్స్

హైదరాబాద్ – సినిమాను తలపించేలా హనీ ట్రాప్ తో ఆటో డ్రైవర్ను కిడ్నాప్ చేసి హత్య చేసిన దారుణ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన ఓ కారు డ్రైవర్ కుటుంబం జగద్గిరిగుట్టలో ఉంటున్నాడు.

ఇతనికి ఏడో తరగతి చదువుతున్న ఓ కూతురు ఉంది. ఈ అమ్మాయిని కుమార్ అనే ఓ ఆటో డ్రైవర్ సినిమా ఆఫర్లు ఇస్తానని నమ్మించాడు.

- Advertisement -

బాలికను నిర్భంధించి..దీంతో అతన్ని నమ్మిన ఆ బాలికను కుమార్ కిడ్నాప్ చేసి యూసఫ్గూడలో ఓ గదిలో నిర్భింధించి లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఆ తర్వాత బాలిక తప్పించుకుని పారిపోయింది. అయితే ఆ బాలిక ఎక్కడికీ వెళ్లిందో ఆచూకీ కూడా తెలియలేదు.

దీంతో ఆ ఆటో డ్రైవర్ను కిడ్నాప్ చేసి హత్య చేయాలని బాలిక తల్లిదండ్రులు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో స్నాప్ చాట్తో తన భార్య సహకారంతో ఆటో డ్రైవర్ను హనీ ట్రాప్ చేశారు.

మాయ మాటలు చెప్పి ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లారు. తమ కూతురు గురించి చెప్పమని కొట్టారు. కూతురు తప్పించుకుని వెళ్లిపోయిందని చెప్పిన కూడా తల్లిదండ్రులు వినలేదు. గట్టిగా కొట్టడంతో ఆ ఆటో డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతన్ని నాగార్జున సాగర్ కాలువలో పడేశారు. దీంతో కుమార్ కనిపించడంలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఆటో డ్రైవర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించాడం. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement