ఇరిగేషన్ అధికారుల నుండి వివరాలు సేకరణ
క్షేత్రస్థాయిలో పరిశీలన
మహాదేవపూర్, ప్రభ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పినాకి చంద్ర ఘోష్ పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యారేజ్ పిల్లర్లు కుంగి ప్రమాదానికి గురి కాగా, ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో విచారణ చేపట్టారు.
విచారణ అనంతరం ముఖ్యమంత్రి ప్రాజెక్టు పరిశీలించి విచారణ వివరాలను మీడియాకు వెల్లడించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించడంతో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పినాకి చంద్ర ఘోష్, ఇరిగేషన్ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కలిసి పరిశీలించారు.
- Advertisement -