Thursday, November 21, 2024

హుజురాబాద్ ఉపఎన్నిక: ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

హుజురాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలో విజయం ఎవరికి వరిస్తుందని అన్నది ఉత్కంఠ రేపుతోంది. సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందా? బీజేపీ తరుపున తొలిసారి పోటీ చేస్తున్న మాజీ మంత్రి గెలుస్తారా? కాంగ్రెస్ పార్టీ ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. దీనిపై పలు సర్వేలు కూడా జరుగుతున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశల మేరకు హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించకూడదని, నిషేధం విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ స్పష్టం చేశారు. ప్రజా ప్రాతినిత్య చట్టం 1951, సెక్షన్ 126 (ఎ) ప్రకారం అక్టోబర్ 30 రాత్రి 7.30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్ నిర్వహించరాదని తెలిపారు. ప్రింట్ మీడియాలో ప్రచురించరాదని, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారాలు చేయరాదని చెప్పారు. ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం నిషేధించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అతిక్రమించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇది కూడా చదవండి: మరో సర్జికల్ స్ట్రైక్స్ తప్పదు: పాక్ కు అమిత్ షా వార్నింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement