హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంటలోపే ముగించాలని కోరారు. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్న పోలీసులు.. వేడుకల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలన్నారు..
ఈ ఆంక్షలు పబ్ లకు, బార్ లకు, ఫంక్షన్ హాలులో నిర్వహించే వేడుకలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి..అలాగే పబ్లిక్ ప్రదేశాలలో వేడుకలను నిషేధించారు.. అలాగే కొత్త సంవత్సరం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు.. పబ్ లలోనూ, పంక్షన్స్ లోనూ డ్రగ్స్ వినియోగించినట్లయితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు..