Friday, November 22, 2024

Restriction – కౌంటింగ్ కేంద్రాల‌లోకి నో సెల్ ఫోన్స్ … రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్

నేటితో లోక్‌సభ ఎన్నికలు ముగియనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్లు గాని, సిబ్బంది గాని సెల్‌ఫోన్లు వినియోగించేందుకు పర్మిషన్ లేదని పేర్కొన్నారు. ఎన్నిక‌ల సంఘం కార్యాల‌యంలో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, అలాగే ఎలాంటి ఎలక్ట్రిక్ పరికరాలు కూడా తీసుకెళ్లకూడదని సూచించారు. స్ట్రాంగ్ రూం నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ఠమైన భద్రత ఉంటుదని తెలిపారు. కౌటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

ఇక పోస్టల్‌ బ్యాలెట్ లెక్కింపు కోసం 276 టెబుళ్లు ఉంటాయని తెలిపారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లు అలగే 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో.. అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కింపు ఉంటుందని తెలిపారు. 2400 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ కేంద్రాల్లో ఉంటారన్నారు. మొత్తంగా ఓట్ల లెక్కింపులో దాదాపు 10 వేల మంది సిబ్బంది పాల్గొంటారని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement