Tuesday, November 26, 2024

సైనికుల సర్వీసు నాలుగేళ్లకే పరిమితం చేయడం దుర్మార్గం : వీహెచ్‌

హెదరాబాద్‌, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో మరణించిన రాకేష్‌ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ ఆసుపత్రి వద్దకు వెళ్లిన పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో కాకుండా కాలినడకతో ఆసుపత్రిలోకి వెళ్లుతానని పోలీసులతో వీహెచ్‌ వాగ్వాదం చేశారు. శాంతిభద్రతల కారణంగా ఆసుపత్రిలోకి అనుమతి లేదని పోలీసులు వారించినా వినకపోవడంతో వీహెచ్‌ను అరెస్టు చేసి లాలగూడ పీఎస్‌కు తరలించారు.

అంతకు ముందు గాంధీభవన్‌లో పార్టీ నేత లక్ష్మణ్‌యాదవ్‌తో కలిసి వీహెచ్‌ మీడియాతో మాట్లాడారు. సైనికుల నియామకాల్లో అగ్నిపథ్‌ పేరుతో నాలుగేళ్వ సర్వీస్‌నే పెట్టడం దుర్మామని ఆయన మండిపడ్డారు. గతంలో 15 నుంచి 20 ఏళ్ల వరకు సర్వీస్‌ ఉండగా అన్ని సౌకర్యాలు కల్పించేవారన్నారు. సైనికులకు పెన్షన్‌ ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేయడం దారుణమన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి యువత ముందుకొస్తుంటే బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా..? అని ఆయన నిలదీశారు. డిఫెన్స్‌ వద్ద నిధులు లేవంటే ప్రపంచడం ముందు దేశం పరువు ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు.

ఇలాంటి సంఘటనలు బీజేపీ మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ మోసం చేశారని ఆయన విమర్శించారు. మృతి చెందిన వ్యక్తికి వీహెచ్‌ సంతాపం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ కాల్పుల ఘటలను టీ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఖండించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. సికింద్రాబాద్‌ కాల్పులకు నిరసనగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గాంధీభవన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేసేందుకు యత్నించిన ఆ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఏఐసీసీ సభ్యులు బక్కా జడ్సన్‌, పార్టీ సీనియర్‌ నాయకురాలు ఉజ్మాషకీర్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement