మంచిర్యాల : కరోనా కాలంలో నిలిపివేసిన ఆదిలాబాద్-నీల్వాయి ఎక్స్ ప్రెస్ బస్ పునరుద్ధరణ చేయాలని ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ వెంకటేశ్ నేత ఫోన్ చేశారు. ఆదిలాబాద్ నుంచి వేమనపల్లి మండలం నీల్వాయి వరకు నడిచే బస్ ను కరోనా సమయంలో నిలిపి వేశారు. ఈ రూట్‌లో అన్ని బస్సులు ప్రారంభమైనా నైట్ హాల్ట్ బస్ లేకపోవడంతో ఆరు నెలలుగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
వివిధ పనుల నిమిత్తం చెన్నూరుకి వచ్చే కోటపల్లి, వేమనపల్లి మండలాల ప్రయాణికులు రాత్రి సమయంలో బస్సుల్లేక ప్రైవేట్ వాహనాలలో అధిక చార్జీలు చెల్లించి ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయాన్ని కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ ఎంపీ వెంకటేశ్ నేత దృష్టికి తీసుకురాగా… వెంటనే స్పందించిన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ వెంకటేష్ నేత ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ కి ఫోన్ చేశారు. సమస్యను వివరించారు. రద్దయిన బస్ ను ప్రారంభిస్తామని ఆర్టీసీ డీఎం తెలిపినట్లు వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
AndhraPrabha #AndhraPrabhaDigital