Friday, November 22, 2024

గల్లంతైన రేషన్‌ కార్డుల పున‌రుద్ధ‌ర‌ణ‌.. కొనసాగుతున్న సర్వే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రేషన్‌ కార్డుల్లో గల్లంతైన అర్హులను గుర్తించి తిరిగి మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరేళ్ల కిందట తెలంగాణలో కొన్ని రేషన్‌ కార్డులను రద్దు చేశారు. వాటిలో అర్హులను గుర్తించి వారికి తిరిగి రేషన్‌ కార్డులను మంజూరు చేయనున్నారు. ఇందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి సర్వే ప్రారంభం కానుంది. తొలగించిన కార్డుల్లోని చిరునామా ఆధారంగా అధికారులు పట్టణాలు, గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నారు. రద్దయిన రేషన్‌ కార్డు దారుల ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి వారు తెల్ల రేషన్‌ కార్డుకు అర్హులా..? కాదా..? అని తేల్చనున్నారు. తొలగిం పునకు గురైన రేషన్‌ కార్డుదారులకు ముందుగా నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత వారు ఏడు రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల ఆధారంగా సర్వే చేసి పునరుద్దరణపై నిర్ణయాన్ని ప్రకటిస్తారు.

క్షేత్రస్తాయి సర్వే కోసం ఆర్‌ఐలను ఫీల్డ్‌ అధికారులుగా నియమించారు. తొలగించిన కార్డు దారుల వివరాలను ప్రతి రేషన్‌ దుకాణం వద్ద ప్రదర్శిస్తారు. ఆ జాబితా ఆధారంగా వారు కార్డు పునరుద్దరణకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వాస్తవానికి దారిధ్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రేషన్‌ కార్డులను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. అయితే ఆదాయం తక్కువగా చూపారని, కారు, ఇతర విలాస వంతమైన జీవితం గడుపుతున్నారన్న కారణాలతో 2016లో కొన్ని రేషన్‌ కార్డులను రద్దు చేశారు. సర్వేలో అనర్హులను అర్హులుగా గుర్తిస్తే ఫీల్డ్‌ ఆఫీసర్లను బాధ్యులను చేసి వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement